ప్రొద్దుటూరు: జాతీయ లోక్ అదాలత్ లో 160 కేసులు పరిష్కారం

746చూసినవారు
ప్రొద్దుటూరు: జాతీయ లోక్ అదాలత్ లో 160 కేసులు పరిష్కారం
ప్రొద్దుటూరు కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, రెండవ అదనపు జిల్లా జడ్జి కే. సత్యకుమారి ఆధ్వర్యంలో మూడు బెంచ్ లను ఏర్పాటు చేశారు. 114 సివిల్ కేసులు, 46 క్రిమినల్ కేసులను మొత్తం 160 కేసులను పరిష్కరించినట్లు జడ్జి తెలిపారు. రూ. 1,50,04,785 విలువగల కేసులు రాజీఅయ్యాయని పేర్కొన్నారు. కక్షిదారులు లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్