గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిఒ నెంబర్ 523 సవరించి ఖాళీగా ఉన్న ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగోన్నతులు కల్పించాలని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయ సంఘరాష్ట్ర ఉపాధ్యక్షులు మస్తాన్ మాట్లాడారు. ఉద్యోగోన్నతుల విషయంలో సమన్యాయ సూత్రం పాటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.