మానవుల్లో ప్రేమతత్వాన్ని మేల్కొల్పి మానవత్వం మూర్తీభవించిన మహనీయులుగా మార్చేందుకు ఏసుక్రీస్తు భూలోకానికి నరావతారిగా వచ్చారని రెవరెండ్ కోలాటి రాజు పేర్కొన్నారు. ప్రొద్దుటూరు స్థానిక గోకుల్ నగర్ లోని ఎస్పీజీ చర్చి-2లో మట్టల ఆదివారం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే రామేశ్వరం సీఎస్ఐ చర్చిలో రెవరెండ్ జాకోబ్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మట్టల ఆదివారం యొక్క విశిష్టతను వివరించారు.