ప్రొద్దుటూరు: అందుబాటులో ఆరోగ్యశ్రీ ఇహెచ్ఎస్ సేవలు

58చూసినవారు
ప్రొద్దుటూరు: అందుబాటులో ఆరోగ్యశ్రీ ఇహెచ్ఎస్ సేవలు
ప్రొద్దుటూరులోని హోలిస్టిక్ ఆస్పత్రిలో పలు రకాల వ్యాధులకు ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్ సేవలు అందుబాటులో ఉన్నాయని సిఇఒ శరత్ బాబు తెలిపారు. ఆసుపత్రిలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుండె, ఎముకల సంబంధిత సమస్యలకు, యాక్సిడెంట్ కేసులకు, తల, నరముల సంబంధిత సమస్యలకు ఎన్టిఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఒపి ఉచితంగా చూసి, అవసరమైన వారికి సర్జరీలు ఉచితంగా చేస్తామన్నారు. సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్