ప్రొద్దుటూరును అభివృద్ది పనులకు నిధులు కేటాయించాలని సీఎం చంద్రబాబు ని ప్రొద్దుటూరు టిడిపి నేతలు కోరారు. బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నందు సీఎం ని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి , పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి కలిశారు. ప్రొద్దుటూరులో ప్రధానరోడ్లు విస్తరణ, గత ప్రభుత్వంలో ఆగిపోయిన అభివృద్ది పనులపై విన్నవించారు. అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, రోడ్ల విస్తరణ జరపాలని కోరారు.