ప్రొద్దుటూరు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. విజయనగరంవీధికి చెందిన రెడ్డివీర రవిశంకర్ (36) అప్పుల బాధతో మనస్తాపానికి గురై హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో చెట్టుకు ఉరివేసుకున్నారు. మద్యం అలవాటు, అప్పులు కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.