ప్రొద్దుటూరు: సిరి ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

53చూసినవారు
ప్రొద్దుటూరు: సిరి ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం
సిరి ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని మిల్లెట్స్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఖాదర్ వలి అన్నారు. మంగళవారం ప్రొద్దుటూరు మండలంలోని వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో సిరి ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం ఈ ఒక్క మార్పుతో నూరేళ్ల ఆరోగ్యం అంశంపై విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. కరస్పాండెంట్ జి. హుస్సేన్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ బి. సిద్ధేశ్వర రావు, పి. కిశోర్ చంద్ర, కె. లావణ్యకుమారి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్