ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి త్వరలో జైలుకెళ్లడం ఖాయమని టీడీపీ కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాజీ ఎమ్మెల్సీ పుల్లయ్య, మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి, టౌన్ బ్యాంక్ ఛైర్మన్ సుబ్బారెడ్డిలతో కలిసి మీడియాతో
మాట్లాడారు. ప్రొద్దుటూరు రాజకీయం రాచమల్లు జాగీర్ కాదన్నారు. ఆయన ప్రజలను, తమ కార్యకర్తలను మభ్య పెడుతున్నాడన్నారు. ఆయన తప్పులకు త్వరలో జైలుకెళ్తాడన్నారు.