ప్రొద్దుటూరు పట్టణం కాలేశ్వరి అపార్ట్మెంట్ సమీపంలో మంగళవారం కంపచెట్లలో వ్యక్తి ఉరేసుకొని మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు చిన్నపాటి తాడుతో ఉరి వేసుకున్నట్లు అక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మృతదేహం నేలకు తాకి ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.