ప్రొద్దుటూరు మున్సిపల్ గాంధీ పార్కులో బుధవారం దీపావళి పండుగ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున చీరలు, లగేజ్ బ్యాగులు పంపిణీ చేశారు. కమిషనర్ మాట్లాడుతూ. దీపావళి పండుగ సందర్భంగా సద్భావన సంఘం, మన ప్రజా సేవాసమితి ఆధ్వర్యంలో పరిశుద్ధ కార్మికులకు వీటిని అందించారన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించి స్వచ్ఛంద సంస్థల వారు బహుమతులను అందించడం అభినందనీయమని అన్నారు.