టీడీపీ నేతపై YCP కార్యకర్త సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై కేసు పెట్టడాన్ని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పోలీసులే మట్కా కేసులో 7వ వార్డ్ అభ్యర్థి శ్రీనాథ్ ఉన్నాడని పోస్టు పెట్టారని చూపించారు. ఏడాది టీడీపీ పాలనలో ఆయనను అణచలేకపోయారా? తప్పేమీ చేయకుండా కామెంట్లకే కేసులా అని విమర్శించారు.