ప్రొద్దుటూరు: "ఎమ్మెల్యే అండదండలతోనే జూదం"

74చూసినవారు
ప్రొద్దుటూరు: "ఎమ్మెల్యే అండదండలతోనే జూదం"
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అండదండలతోనే జూదాల జరుగుతున్నాయని మున్సిపల్ వైస్ ఛైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి ఆరోపించారు. ప్రొద్దుటూరులో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. టీడీపీ కౌన్సిలర్ మునీర్ మట్కా నిర్వహిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారన్నారు. విచ్చలవిడిగా మద్యం, జూదం, రేషన్ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతుందన్నారు. మునీర్ తో ఎమ్మెల్యే కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్