గత ప్రభుత్వంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో, జగనన్న కాలనీలలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతోందని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. ఆదివారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ విచారణ అధికారులకు రైతులు, ప్రజలు నిజాలను చెప్పి సహకరించాలని కోరారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను కచ్చితంగా అమలు చేస్తుందని తెలిపారు. రోడ్లను వేయిస్తున్నామని, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశామన్నారు.