ప్రొద్దుటూరు: సైనికుల కోసం జనసేన నాయకుల ప్రత్యేక పూజలు

68చూసినవారు
ప్రొద్దుటూరు: సైనికుల కోసం జనసేన నాయకుల ప్రత్యేక పూజలు
దేశం కోసం పాటుపడుతున్న సైనికులకు దైవబలం ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేసినట్లు జనసేన పార్టీ నాయకులు రమణ, మాదాసు మురళి తెలిపారు. మంగళవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచనల మేరకు మధురై జిల్లాలోని తల మదీరసోలాయ్ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఇటీవల మృతిచెందిన మురళీనాయక్ తోపాటు అమరులైన సైనికులకు జోహార్ అని నివాళులు అర్పించారు. కాటంశెట్టి నాగేంద్ర, గోపీ, సిద్దు, విజయ, రాము, నరేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్