ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డిని జాయితీకి మచ్చ తెచ్చే పనులను ప్రాణం పోయినా చేయనని ఆయన కుమారుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి తెలిపారు. శుక్రవారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను ఖండించారు. నిమ్మకాయల సుధాకర్ రెడ్డి వెంచర్ విషయంలో తాను రూ. 15 కోట్లు అడగలేదన్నారు. నిజాయితీగా డబ్బు సంపాదిస్తానే గాని ఇలాంటి పనులు చేయనన్నారు.