ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్, లోకేశ్ ప్రకటించిన 32 సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తే వైసీపీ కార్యకర్తగా, మాజీ ఎమ్మెల్యేగా ఆయనకు పాలాభిషేకం చేస్తానన్నారు. తన నెత్తురంతా వైసీపీదేనని అయినప్పటికీ పాలాభిషేకం చేస్తానన్నారు.