తమ సమస్యలను పరిష్కరించాలని ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు రిలే దీక్ష చేపట్టారు. యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, కార్యదర్శి సాల్మన్ మాట్లాడుతూ గతంలో కార్మికులు చేసిన సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఆప్కాస్ మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలన్నారు.