విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఎంపీజే నాయకులు మంగళవారం ప్రొద్దుటూరు తహసిల్దార్ గంగయ్యకు వినతిపత్రం అందించారు. ఎంపీజే పట్టణ అధ్యక్షుడు హుస్సేన్ బాషా మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యా కానుకను, తల్లికి వందనం పథకాలను అమలు చేయాలన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన మెడికల్ కాలేజీలను పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలన్నారు.