ప్రొద్దుటూరు మండలం భగత్ సింగ్ కాలనీలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దూరపు పరుగు పోటీలు నిర్వహించారు. 2, 4, 6, 8, 10 కిలోమీటర్ల దూరపు పరుగు పోటీల్లో జిల్లాలోని 70 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభ చూపారు. విజేతలైన వారు జనవరి 5న పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి దూరపు పరుగు పోటీలకు ఎంపికైనట్లు సోమవారం బాష అథ్లెటిక్స్ ఫౌండేషన్ కార్యదర్శి అహ్మర్ బాష తెలిపారు.