ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ఆంధ్రప్రదేశ్ మదర్ థెరిస్సా దివ్యాంగుల సేవా సమితి అధ్యక్షుడు షాకీర్ హుస్సేన్ కు చిత్తూరులో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ బెస్ట్ సర్వీస్ అవార్డు అందించారు. షాకీర్ హుస్సేన్ అందిస్తున్న సేవలను గుర్తించి ఆయనను ఫౌండేషన్ ప్రతినిధి సోమలరాజు అవార్డు అందించి శాలువా కప్పి సత్కరించారు.