ప్రొద్దుటూరు: పోలీస్‌ స్టేషన్‌లోనే ఎస్‌ఐపై దాడి

76చూసినవారు
ప్రొద్దుటూరు: పోలీస్‌ స్టేషన్‌లోనే ఎస్‌ఐపై దాడి
పోలీస్ స్టేషన్‌లోనే ఎస్‌ఐపై దాడికి పాల్పడిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. రాజుపాళేనికి చెందిన చిన్న లింగమయ్య, హర్ష అనే ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్తుండగా వారిని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన యువకులను ప్రొద్దుటూరు గ్రామీణ ఠాణా ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీ ఆసుపత్రికి తరలించారు. అయితే కారు డ్రైవర్‌ని ఠాణాకు తీసుకువెళ్లి కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చారు. అయితే యాక్సిడెంట్ చేసిన వారిని ఎస్‌ఐ వదిలేశాడని గాయపడిన వారి కుటుంబ సభ్యులు ఎస్ఐపై దాడికి పాల్పడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్