పశు వైద్య విద్యార్థుల న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్సీ, జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు గేయానంద్ తెలిపారు. బుధవారం ప్రొద్దుటూరు మండలం గోపవరం వద్దనున్న పశువైద్య కళాశాలలో విద్యార్థులు చేస్తున్న సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల డిమాండ్ లు న్యాయమైనవి అన్నారు. పశువైద్య విద్యార్థుల స్టైఫండ్ పెంపుపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తో మాట్లాడుతానని తెలిపారు.