మాఫియా కార్యక్రమాలకు నిలయంగా మారిన ప్రొద్దుటూరులో పూజ పాఠశాల ట్రస్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు శుక్రవారం ప్రొద్దుటూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఎమ్మార్వో కు వినతి పత్రం అందజేశారు. రాయలసీమ పరిరక్షణ సంఘం అధ్యక్షుడు ప్రతాపరెడ్డి, రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు జగన్, మాదిగ స్టూడెంట్స్ పెడరేషన్ అధ్యక్షుడు పాల్గొన్నారు.