రాజుపాలెం మండలం వెల్లాలలోని చెన్నకేశవ సంజీవరాయ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవ వేడుకలలో భాగంగా మూడు రోజులుగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం చెన్నకేశవ సంజీవరాయ స్వామి రథోత్సవం వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు సంజీవరాయ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేపట్టారు.