ప్రొద్దుటూరులో రోడ్ల విస్తరణ పనులను ప్రజలను ఒప్పించి చేపడుతామని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి తెలిపారు. మంగళవారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి రోడ్ల విస్తరణ పనులను అడ్డుకుంటున్నారన్నారు. ప్రభుత్వ చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించి రోడ్లను విస్తరిస్తామన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం మైదుకూరు రోడ్డు, కొర్రపాడు రోడ్డు, ఇతర రోడ్లను విస్తరించి అభివృద్ధి చేస్తామన్నారు.