ప్రొద్దుటూరు లోని స్థానిక నందినీ క్లాత్ మార్కెట్లో ఉన్న జనవిజ్ఞాన వేదిక కార్యాలయంలో ఈనెల 24, 25 తేదీలలో రెండు రోజుల పాటు పిల్లల కథా వర్క్ షాప్ ను 'కథా వసంతం 2కె25' పేరుతో నిర్వహిస్తామని, దీనిని విజయవంతం చేయాలని జేవీవీ రాష్ట్ర కార్యదర్శి తవ్వా సురేష్, ఉపాధ్యక్షుడు వేంపల్లి రాజశేఖర్ తెలిపారు. బుధవారం స్థానిక జేవీవీ కార్యాలయంలో పోస్టర్లను వారు ఆవిష్కరించారు. వివరాలకు 9705432038, 9705333305 సంప్రదించాలన్నారు.