ప్రతి సందర్భంలో రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పగ పగ అంటుండటం ఆయన సైకో తత్వానికి నిదర్శనమని టీడీపీ మాజీ ఇన్ఛార్జి డాక్టర్ జీవి. ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం ప్రొద్దుటూరులో మాట్లాడిన ఆయన ఇకపై చంద్రబాబుపై, టీడీపీపై ఇలా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రతిపక్ష నేతగా బాధ్యతగా వ్యవహరించాలన్నారు.