ప్రొద్దుటూరు: ఎంపీడీఓపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

74చూసినవారు
ప్రొద్దుటూరు: ఎంపీడీఓపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
అన్నమయ్య జిల్లా గాలివీడు మండల ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రొద్దుటూరు ఎంపీడీవో సానేపల్లి సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద శనివారం అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులపై దాడులు చేయడం తగదన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్