రాష్ట్ర రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని టీడీపీ కౌన్సిలర్ గాజుల శివ జ్యోతి డిమాండ్ చేశారు. సోమవారం ప్రొద్దుటూరులో ఆమె మాట్లాడుతూ రాజధాని అమరావతి వేశ్యల రాజధాని అనుచితంగా వ్యాఖ్యానించిన కృష్ణంరాజును కఠినంగా శిక్షించాలన్నారు. దేవతల రాజధాని అయిన అమరావతిని ఈ విధంగా మాట్లాడడం మహిళలను కించపరచడమే అన్నారు. దీనిపై సాక్షి టీవీ, మాజీ సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని తెలిపారు.