ప్రొద్దుటూరు అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో బుధవారం మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అగస్త్యేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, రాజరాజేశ్వరికి కుంకుమార్చన నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. గంగా రాజరాజేశ్వరి సమేత అగస్త్యేశ్వర స్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి కళ్యాణ వేదికపై ఆశీనులను చేశారు. వేదపండితులు వైభవంగా కళ్యాణోత్సవం నిర్వహించారు.