అమెరికాలోని ఆదానీ విద్యుత్ కొనుగోలు విషయంలో జగన్ పై విమర్శలు చేయడం చంద్రబాబుకు, షర్మిలమ్మకు తగదని మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ ఎక్కడో అమెరికాలో ఉన్న ఆదానికి ఏపీలో ఉన్న జగన్ కు ఏమి సంబంధం అని ఆయన ప్రశ్నించారు. లేని కేసులను వైసీపీ అధినేత జగన్ పై బదలాయి స్తున్నారన్నారు. రూ 1750 కోట్లు జగన్ ఆదానిని లంచం అడిగాడని విమర్శించడం మంచిది కాదన్నారు.