ప్రొద్దుటూరు: మున్సిపల్ కమిషనర్ కు దరఖాస్తులు అందజేత

61చూసినవారు
ప్రొద్దుటూరు: మున్సిపల్ కమిషనర్ కు దరఖాస్తులు అందజేత
పేద ప్రజల సంక్షేమం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విశ్వకర్మ పథకం కింద ప్రొద్దుటూరులో మహిళలు, పురుషులు వేలాదిమంది దరఖాస్తు చేసుకున్నారని బుధవారం బీజేపీ కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు అన్నారు. ఈ పథకం కింద వచ్చిన 2, 906 దరఖాస్తులను మున్సిపల్ కమిషనర్ కు ఆయన అందజేశారు. ఈ పథకం కింద ప్రతి లబ్ధిదారునికి తగిన శిక్షణ ఇప్పించి పథకం ఫలితాలను అందజేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్