గొప్ప సంఘసంస్కర్త, బీసీల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే వర్ధంతిని బుధవారం ప్రొద్దుటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీమాంధ్ర బీసీ నాయకుడు చల్లా రాజగోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీల అభ్యున్నతి కోసం జ్యోతిరావు పూలే చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పాల్గొన్నారు.