విద్యార్థులు సమతుల ఆహారం తీసుకోవాలి

59చూసినవారు
విద్యార్థులు సమతుల ఆహారం తీసుకోవాలి
విద్యార్థులు సమతుల ఆహారం తీసుకోవాలని డాక్టర్ అపర్ణ శ్రీరామ్, యూనాని డాక్టర్ నిరంజన్ నాయక్ సూచించారు. శుక్రవారం ప్రొద్దుటూరు స్థానిక హోమస్ పేటలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఆయూష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు డీవీ రవీంద్రుడు, ఆయూష్ డిపార్ట్మెంట్ సిబ్బంది మహేశ్వరయ్య, రాజారెడ్డి, రమణ, జనవిజ్ఞాన వేదిక నాయకుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్