తలపనూరు గ్రామంలో ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ గంగమ్మ దేవికి విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు చల్లను నైవేద్యంగా సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.