ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు అర్హులైన పేదలందరికీ రెండు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రామయ్య, ఏరియా కార్యదర్శి సుబ్బరాయుడు డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రొద్దుటూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఇంటి నిర్మాణానికి రూ. 5లక్షలు ఇవ్వాలన్నారు. అనంతరం తహశీల్దార్ గంగయ్యకు వారు వినతి పత్రం సమర్పించారు.