వరలక్ష్మీవ్రతం సందర్భంగా వివిధ ఆలయాల్లో మహిళలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీవ్రతం ఆచరించారు. వరాలతల్లి వరలక్ష్మి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం ప్రొద్దుటూరు స్థానిక అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో 108 మంది సుమంగళులు సామూహిక వరలక్ష్మీవ్రతం ఆచరించారు. కాలక్షేప మండపంలో వరలక్ష్మి అమ్మవారిని కొలువుదీర్చి గజవాహనంపై ఆశీనులను చేశారు. మహిళలు అమ్మవారిని కలశంలోకి ఆవాహన చేసి వేద మంత్రాలతో అర్చించారు.