వేడి నుంచి ఉపశమనం కలిగించేందుకు మంగళవారం వేంపల్లెలో ఉరుములతో కూడిన వర్షం ఓ మోస్తరుగా కురిసింది. మురుగు కాలువలు నిండి ఆ నీరంతా రోడ్లుపై ప్రవహించింది. ఒక్కసారిగా మేఘావృతమై వర్షం కురవడంతో జనాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయారు. వాతావరణం చల్లబడడంతో ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణం చేసే వారు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై మురుగునీరు వంకలా ప్రవహించడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడ్డారు.