పులివెందుల మండలం అచ్చివెళ్లి గ్రామంలోని వాటర్ ట్యాంక్ వద్ద పైపు పగిలి తాగునీరు వృథాగా పోతోంది. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. పైపు చుట్టూ గుడ్డ(బట్ట) చుట్టారు. అయినా పైపు నుంచి తాగునీరు వృథాగా పోతోంది. సంబంధిత అధికారులు స్పందించి పగిలిన తాగునీటి పైపును మార్చాలని కోరుతున్నారు.