ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తెలిపారు. శుక్రవారం పులివెందులలోని టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. పులివెందుల నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలను ఆయనకు విన్నవించారు. ఈ సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కరించాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు.