రాయలసీమలో పేరు ప్రఖ్యాతి చెందిన గండి క్షేత్రంలోని వీరాంజనేయ స్వామి నిత్యాన్నదానానికి దాత వేమా వెంకట రమణ రూ. 50 వేలు వితరణ చేశారు. శనివారం సాయంత్రం వేంపల్లె గ్రామానికి చెందిన ఎపిజిబి విశ్రాంతి ఉద్యోగి వేమా వెంకట రమణ, ఆయన సతీమణి వేమా నారాయణమ్మ ఎసి వెంకట సుబ్బయ్యకు రూ. 50 వేలు చెక్కును అందజేశారు. నిత్యాన్నదానానికి ఆర్థిక సాయం చేయడం సంతోషకరమని వెంకట సుబ్బయ్య తెలిపారు.