గండి దేవస్థానం ఇఒగా పనిచేస్తున్న ముకుందారెడ్డి అవినీతి అక్రమాలపై విచారించాలని దేవాదాయ కమిషనర్ కు శుక్రవారం ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి ఫిర్యాదు చేశారు. గండిలో ఐదు సంవత్సరాలుగా అనేక అక్రమాలు జరిగాయని, అర్హత లేకున్నా ముకుంద రెడ్డిని ఇఒగా నియమించారని పేర్కొన్నారు. భక్తులు ఇచ్చిన విరాళాలను గండి దేవస్థానం ఖాతాలో జమ చేయకుండా ఇఒ తన ఖాతాకు జమ చేసుకొని దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.