ఆవోపా ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

77చూసినవారు
ఆవోపా ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
ఆవోపా ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వేంపల్లి వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ శేషపాణి వైద్య సేవలు అందించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగిన ఉచిత హోమియో శిబిరానికి దాదాపు 80 మంది వైద్య సేవలు పొందారు. వివిధ రకాల వైద్య సేవలతో పాటు ఇతరత్రా సేవలు అందిస్తున్నట్లు సభ్యులు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్