పులివెందుల పట్టణంలోని సాయిబాబా గుడి సమీపాన మంగళవారం మృతి చెందిన వానరానికి(కోతి) పాత్రికేయ మిత్రులు అంత్యక్రియలు నిర్వహించారు. నిత్యం ఉదయం, సాయంత్రం కోతులు కాలనీలో సంచరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఉదయం ఓ కోతి చనిపోయి పడి ఉంది. గమనించి స్థానికులు పాత్రికేయలకు చెప్పడంతో అందరూ అక్కడికి చేరుకున్నారు. వానరాన్ని ఆంజనేయుడిగా భావించి కదిరి రోడ్డు ఉన్న ఆంజనేయ స్వామి ఆవరణ సమీపంలో అంత్యక్రియలు నిర్వహించారు.