చక్రాయపేట మండలం గండిలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. కడప దేవాదాయశాఖ సూపరింటెండెంట్ రమణమ్మ పర్యవేక్షణలో 55 రోజులుగా భక్తులు స్వామివారికి హుండీల ద్వారా సమర్పించిన కానుకలను లెక్కించినట్లు తెలిపారు. 7 శాశ్వత హుండీల ద్వారా రూ. 36, 48, 364, అన్నప్రసాద వితరణ హుండీ ద్వారా రూ. 62, 317ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు.