జీవో 117, 77లను రద్దు చేయాలి: తులసిరెడ్డి

62చూసినవారు
ఏపీలో జగన్ పాలనలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తమైందని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి పేర్కొన్నారు. గురువారం వేంపల్లిలో వారు మాట్లాడుతూ. గత వైసీపీ పాలనలో జీవో 117 ప్రాథమిక విద్యకు ప్రాణాలు తీశాయని,
జీవో 77తో ప్రైవేట్, ఎయిడెడ్ పీజీ కాలేజ్ విద్యార్థులకు స్కాలర్షిప్ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాటి అమలుతో ప్రాథమిక పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందని, ఆ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్