ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని పులివెందులలో పూర్తిగా నిషేధించేందుకు వ్యాపారస్తులు, ప్రజలు సహకరించాలని మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్ పేర్కొన్నారు. గురువారం పులివెందుల మున్సిపల్ కార్యాలయంలో వ్యాపార సముదాయాలు హోటళ్ల యజమానులతో మున్సిపల్ కమిషనర్ రాముడు సమావేశం అయ్యారు. పులివెందులలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరించారు.