లింగాల మండలంలోని తేర్నాంపల్లె గ్రామంలో 2. 70కేజీల గంజాయిని పట్టుకున్నట్లు శనివారం రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు గ్రామంలో ముగ్గురి వద్ద గంజాయి ఉన్నట్లు తెలిసిందన్నారు. ఎస్ఐ మధు సూధనరావు సిబ్బందితో కలిసి దాడులు చేశారన్నారు. ఈ దాడుల్లో షెక్షావల్లి, సబీర, కుళ్ళాయప్ప అనే ముగ్గురిని అరెస్టు చేసి వారినుంచి 2. 70 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.