పులివెందులలో ఆదివారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం మేఘావృతమై వర్షం పడింది. గత రెండు రోజులుగా ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఈ వర్షంతో కొంత ఊరట లభించింది. వర్షంతో వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. అయితే వర్షం కారణంగా కొంతకాలం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.