పులివెందుల పట్టణంలోని గాంధీ సర్కిల్లో నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను శుక్రవారం మధ్యాహ్నం మున్సిపల్ కమిషనర్ రాముడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అన్న క్యాంటీన్ కౌంటర్, అక్కడి సదుపాయాలను పరిశీలించారు. వంటకాల రుచి గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని, ప్రజలు అన్నాన్ని వృథా చేయకుండా తినాలన్నారు. కార్యక్రమంలో ఏఈ లోకేశ్, తదితరులు పాల్గొన్నారు.